Monday, May 6, 2024

Congress – జూరాల కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలంటూ కలెక్టరేట్ ముట్టడి

జోగులాంబ గద్వాల (ప్రతినిధి)ఆగస్టు 8 (ప్రభ న్యూస్)జోగులాంబ గద్వాల జిల్లా:జూరాల కుడి కాలువకు నీటిని విడుదల చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ లోకి వెళ్లేటప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. సంపత్ కుమార్ మాట్లాడుతూ..ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారులు అసమర్థవల్ల నిర్ణయాల వల్ల రైట్ మెయిన్ కెనాల్ పూర్తిగా ఎండిపోయిందని దాని కింద ఉన్న 21 గ్రామాలలో వేలాది ఎకరాలు ఎండిపోయాయని దీనికి కారణం ప్రభుత్వంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టు కమిషన్లు కు కకృతి పడి కొత్తగా బ్రిడ్జి నిర్మాణం ఇప్పుడు చేయడం ఏమిటని నీళ్లు వదిలే సమయంలో బ్రిడ్జి కట్టడం ఏమిటని ప్రశ్నించారు.

అల్లంపూర్ నియోజకవర్గం లోని ఇటిక్యాల మండలంలో 18 గ్రామాలు గద్వాలలోని మూడు గ్రామాలు మొత్తం 21 గ్రామాలకు నీటి విడుదల కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. జూరాల కుడి కాల్వకు నీళ్లు వదేలేదాకా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement