Monday, April 29, 2024

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పై మేక‌ర్స్ క్లారిటీ.. రిలీజ్ అప్పుడేనా..?

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ అప్ క‌మింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన యువ నటి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, 2012లో వ‌చ్చిన‌ గబ్బర్ సింగ్ కాంబో మ‌ళ్లీ రిపీట్ అవుతుండ‌టంతో.. పవర్ స్టార్ అభిమానులు ఈ కాంబినేషన్ పై ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇక, మూవీలోని కొన్ని భాగాలు షూటింగ్ పూర్తి చేసారు మేక‌ర్స్. ఆ త‌రువాత‌ పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర కోసం విరామం తీసుకున్నారు.

ఆ యాత్ర త‌రువాత మ‌ళ్లీ చిత్రనిర్మాతల నుండి ఎటువంటి అప్‌డేట్‌లు లేకపోవడంతో.. సోష‌ల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిర్మాణం ఆగిపోయిందంటూ కొన్ని రూమ‌ర్స్ స్టార్ట్ అయ్యాయి. కాగా, ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేర్ వీరయ్య 200 రోజుల వేడుకను జరుపుకోగా.. ఈ ఈవెంట్ సందర్భంగా, మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ చుట్టూ ఉన్న అన్ని పుకార్లను క్లియర్ చేశారు. తాము సినిమా షూటింగ్/ప్రొడక్షన్‌ని పునఃప్రారంభించబోతున్న‌ట్టు స్పష్టం చేశారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా స‌మ్మ‌ర్ కి థియేటర్లలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement