Saturday, April 27, 2024

మధిరలో పలు అభివృద్ధి పనులను ప్రారంబించిన మంత్రి పువ్వాడ

మధిర – ఖమ్మం బ్యూరో – మధిర పట్టణంలో శనివారం పర్యటించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు BRS శ్రేణులు భారీ మోటార్ సైకిల్ ద్వారా ఘనంగా స్వాగతం పలికి పట్టణంలో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు సారధ్యంలో మధిర కేంద్రంలో చేపట్టిన రూ.5.70 కోట్లతో నూతనంగా అంబారుపేట ట్యాంక్ బండ్, చిన్న పిల్లల ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, ఓపెన్ జిమ్, స్టీల్ కాంపౌండ్ తదితర పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అనంతరం టూరిజం శాఖ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన స్పీడ్ బోట్ ను ప్రారంభించారు.

పట్టణంలోని వర్తక సంఘం రోడ్ నందు రూ.4.50 కోట్ల తో నూతనంగా నిర్మించిన వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కేట్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. తెలంగాణ తల్లి సెంటర్ నూతనంగా నిర్మించనున్న నూతన మున్సిపల్ భవనం, అంబేద్కర్ భవనం (ఆడిటోరియం), డంపింగ్ యార్డ్, వివిధ అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలో రాయపట్టణం సెంటర్ చేపట్టనున్న ప్రధన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు, CC రోడ్స్, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతం, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, మున్సిపల్ చైర్మన్ మొండితొక లత, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, TPO రమేష్, నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement