Thursday, November 7, 2024

రాజ‌మౌళిని స‌త్క‌రించిన.. మంత్రి హ‌రీష్ రావు

తెలుగు జాతి ఖ్యాతిని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌పంచ‌వ్యాప్తం చేశార‌ని కొనియాడారు మంత్రి హ‌రీశ్ రావు.ఈ మేర‌కు రాజ‌మౌళిని స‌న్మానించారు. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, మంత్రి హరీష్ రావు బంజారాహిల్స్ లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలని అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన చిత్రాల్లో దేశభక్తి, సామాజిక స్పృహ కనిపిస్తాయి అని అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు సాధించడంతో హరీష్ రావు జక్కన్నని సన్మానించారు. భవిష్యత్తులో రాజమౌళి మరిన్ని విజయాలు అందుకోవాలని కోరారు. రాజమౌళి మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడ హరీష్ రావు గారి పనితీరు చూసినప్పటి నుంచి నేను ఆయనకి అభిమానిగా మారిపోయా అని రాజమౌళి అన్నారు. అంతకు ముందు మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్.. ఎంఎన్ జె ఆసుపత్రిలో రెండేళ్ల పాటు పేషంట్స్ కేరింగ్, సెక్యూరిటీ లాంటి బాధ్యతలని తామే తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement