Sunday, May 5, 2024

ఏలూరులో నాలుగు రైల్వే అండర్ పాసుల నిర్మాణం: ఎంపీ కోటగిరి శ్రీధర్

దెందులూరు, ప్రభ న్యూస్ : ఏలూరు జిల్లాలో రైల్వే శాఖ దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గంలో అండర్పాసులు నిర్మాణం చేస్తుంద‌ని ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీ‌ధ‌ర్ అన్నారు. ఇప్పటివరకు రైల్వే క్రాసింగ్ గేట్లు ఉండటంతో ఆ గేట్లు మీదుగా ప్రయాణం చేసే వాహనదారులు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం దెందులూరు అలుగులుగూడెం, అంబరుపేట, పాతూరు వద్ద నాలుగు అండర్పాస్ ల నిర్మాణం రైల్వే శాఖ పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలతో ప్రణాళికతో చేపట్టింద‌న్నారు. ఈ నాలుగు అండర్ పాసుల నిర్మాణం వల్ల దాదాపు 2 లక్షల 74 వేల మందికి పైగా వాహనదారులకు, ప్రయాణికులకు ప్రయాణ ఆటంకాలు తొలగిపోయన్నారు. ముఖ్యంగా రైల్వే గేటు దాటుతుండగా జరిగే ప్రమాదాలు ఇకపై జరిగే అవకాశం ఉండదన్నారు. అతిత్వరలో పూర్తి స్థాయిలో రెండు నియోజకవర్గాల్లో నాలుగు ప్రాంతాల్లో ప్రయాణికులు అసౌకర్యం లేకుండా అండర్ పాస్ ల ద్వారా రాకపోకలు సాగించనున్నారు. ఈ నిర్మాణాలు ఏలూరు ఎంపీగా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కోటగిరి శ్రీధర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement