Sunday, May 5, 2024

వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : డీహెచ్ శ్రీనివాసరావు

మంచిర్యాల టౌన్, జూన్ 11 (ప్రభన్యూస్): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు, జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రామ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులకు వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహించడంపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ జి.సి.సుబ్బా రాయుడు, డాక్టర్ నరేందర్ రాథోడ్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ ధన్ రాజ్, మంచిర్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.సులేమాన్, డిప్యూటీ డీఎంహెచ్ వోలు, ఉమ్మడి జిల్లాలోని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఆర్ ఎంవోలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement