Thursday, May 2, 2024

CFO 2023 సమావేశానికి ముఖ్య అతిథిగా.. మంత్రి హరీష్ రావు

సిఐఐ 4వ ఎడిషన్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి హ‌రీశ్ రావు. సాంకేతికత, పరిశోధన, సుపరిపాలన ఈ మూడు అంశాలతో సభ నిర్వహించడం గొప్ప విషయం.సిఐఐ వారి ఆధ్వర్యంలో ఐటీసీ కాకతీయ హోటల్ లో నిర్వహించిన CFO 2023 సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజ‌రైయ్యారు. CFO సభ్యులుగా మీరు చేసే కృషి వల్ల సంస్థతో పాటు ఈ దేశం కూడా బలపడుతుంది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ అంధకారంలో ఉంటుంది అని అన్నవాళ్లే ఈరోజు తెలంగాణ మోడల్ అని అంటున్నారు.మన ముఖ్యమంత్రి కేసీఆర్ సిఎఫ్ఓ సీఈవోగా, ముఖ్యమంత్రిగా పని చేశారు కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధిని చూస్తుంది.దేశంలో అన్ని వర్గాలకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే.వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర కరెంట్ ముఖ్య మంత్రిగారి పాలనాదక్షత వల్లనే సాధ్యమైంది.హైదరాబాదులో ఏరకమైన కరెంటు ఉంటుందో తెలంగాణ బార్డర్ లో ఉన్న చిట్ట చివరి గ్రామంలో కూడా అంతే నాణ్యమైన కరెంటును అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అన్నారు మంత్రి.

గతంలో ఇన్వర్టర్, కన్వర్టర్ జనరేటర్లు కనిపించేవి కానీ ఈరోజు తెలంగాణలో అవి కనిపించని పరిస్థితి. ఇప్పుడు 17000 మెగావాట్ల కరెంటు తెలంగాణ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏడాది చివరి కల్లా 20 వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి తెలంగాణలో జరుగుతుంది. వచ్చేయేడాది నుండి మనమే ఇతర రాష్ట్రాలకు కరెంటును అమ్మె పరిస్థితికి రాబోతున్నాం. 3 లక్షల 17వేల తలసరి ఆదాయంతో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది. గతంలో కూడా ముఖ్యమంత్రులను చూసాం. కొంతమంది సంక్షేమంపైన దృష్టి పెడితే కొంతమంది అభివృద్ధి పై ఫోకస్ చేశారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం సంక్షేమము, ఐటి, వ్యవసాయము ఇలా అన్ని రంగాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నారు. గత 40 సంవత్సరాలు నుండి వరి ఉత్పత్తిలో పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మూడు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ రోజు తెలంగాణ పండిస్తుంది. తెలంగాణలో బతుకుదెరువు కోసం బొంబాయి, దుబాయ్ బాట పట్టేవారు. ఈరోజు తెలంగాణలో వలసలు బంద్ అయినాయి.మానవ మనుగడుకు ఆధారం నీళ్లు. అలాంటి నీళ్లను మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒడిసి పట్టుకున్నం. అందుకనే తెలంగాణలో ఈరోజు అభివృద్ధి సాధ్యమైంది. గతంలో హైదరాబాదులో నీటి సమస్య గురించి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళన చేసేవారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు.ప్రతి ఇంటికి త్రాగునారు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.సంక్షేమమే కాదు ఐటీ, పరిశ్రమల వృద్ధిలో కూడా దేశంలో తెలంగాణ నెంబర్ వన్.ఐటీ సెక్టార్లో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.ఈరోజు దేశంలో గ్రామీణ, పట్టణ అభివృద్ధిలో 34% అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు అంటే తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఎదిగిందని అర్థం. గత తొమ్మిది సంవత్సరాల్లో గ్రీన్ కవర్ 7.4 శాతానికి పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement