Thursday, May 23, 2024

మ‌రింత క‌ష్ట‌ప‌డి ప‌ని చేయండి – పంచాయతీ సెక్రెటరీలకు మంత్రి హారీష్ సూచ‌న

మెదక్ ప్రతినిధి:ప్రభ న్యూస్ – తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్ధిక ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావ్ తెలిపారు.సోమవారం మెదక్ లో పర్యటించిన ఆయన మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయితీ సెక్రటరీ లకు రెగ్యులర్ చేస్తూ ఇచ్చే నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇవాల్టి నుంచి మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులే, మరింత ఉత్సాహంతో కష్టపడి పని చేయాలని కోరుకుంటున్నామన్నారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో తెలంగాణ పల్లె లాంటి పల్లెలు కనపడవని మంత్రి కొనియాడారు. దేశంలో మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణకు 38 శాతం అవార్డులు గ్రామపంచాయతీలకు వస్తున్నాయంటేనే సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే సాధ్యమైందన్నారు.రాష్ట్రంలో ఇప్పటికే 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

ప్రతి తాండ గ్రామపంచాయతీ చేసుకొని కొత్త గ్రామ పంచాయతీలో సెక్రెటరీ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా పదివేల పోస్టులను భర్తీ చేశారని తెలిపారు.వానకాలం వచ్చిందంటే పాత రోజుల్లో రోగాలతో ఊర్లు వణికి పోతున్నాయి అనే వార్తలు చూసేవాళ్ళమని,ఇప్పుడు మిషన్ భగీరథ, పల్లె ప్రగతి వల్ల ఆ పరిస్థితి లేదు. పల్లెలలో అంటు వ్యాధులు నిర్మూలించ గలిగామన్నారు. ప్రతి ఊర్లో ట్రాక్టర్ ట్రాలీ, నర్సరీ, డంప్ యార్డ్, వైకుంఠధామంలతో విజయవంతంగా పల్లెలను పరిశుభ్రంగా కాపాడుకుంటున్నామన్నారు. ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని,డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెంబర్ వన్ గా మారిందన్నారు.పంచాయితీ సెక్రెటరీ కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ సొంత తల్లిదండ్రుల్లాగా ఆలోచించి ఉద్యోగాన్ని రెగ్యులర్ చేశార‌న్నారు.

కల్మషం లేని సీఎం మీకు ఉద్యోగం ఇచ్చి మీ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసింది కూడా కేసీఆర్ యే నని కొనియాడారు.ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్న నానుడి ఒక 40 ఏళ్లు దేశంలో నడిచింది కానీ ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది దేశమచరిస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు.ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శులకు నియామకపు పత్రాలు అందజేశారు

ఈ కార్య‌క్ర‌మంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్. సునీత లక్ష్మారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్యేలు యం.పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి,క్రాంతి కిరణ్,భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ రాజర్షి షా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన హ‌రీష్ రావు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 19న మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో సమీకృత కలెక్టరేట్‌ భవనంతో పాటు జిల్లా పోలీస్‌ కార్యాలయంతో పాటు బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యాలయాల పనులను సందర్శించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement