Monday, June 10, 2024

AP : జగన్మాతను దర్శించుకున్న రాష్ట్ర డిజిపి

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న జగన్మాతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కు గురువారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా కుటుంబసభ్యులతో కలిసి విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.

- Advertisement -

అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్ ఆలయ అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement