Wednesday, June 12, 2024

AP : పటిష్ఠమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలి…సీఈవో ముకేశ్ కుమార్ మీనా

శ్రీకాకుళం,మే 23(ప్ర‌భ‌న్యూస్‌): పటిష్ఠమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టరలకు ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రత, సిసి టివి లు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా నుండి జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు శ్రీ శివానీ ఇంజ‌నీరింగ్ క‌ళాశాలలో ఏర్పాటు చేయడమైనదన్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు వివరాలను, పోస్టల్ బ్యాలెట్, తదితర వివరాలను వివరించారు. మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయడమైనదని, పటిష్టమైన బార్ కేడింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది రెండవ రేండమైజేషన్ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆయా జిల్లాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో చేసుకున్న ఏర్పాట్లుపైన, ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ పై జిల్లా ఎన్నికల అధికారులు సిఈఓ కు వివరించారు. జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, పలాస, శ్రీకాకుళం, పాతపట్నం, ఇచ్ఛాపురం, నరసన్నపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు భరత్ నాయక్, సి.హెచ్. రంగయ్య, అప్పారావు, సుదర్శన్ దొర, రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement