Sunday, May 19, 2024

ఫారెస్ట్ లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

కొండపాక : కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని శవం చెట్టుకు వేలాడుతూ ఉపాధి కూలీల కంట పడింది. ఈరోజు ఉదయం ఉపాధి పనుల్లో భాగంగా కొందరు కూలీలు ఫారెస్ట్ ప్రాంతంలోకి వెళ్లగా కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని శవాన్ని కూలీలు గమనించారు. సమాచారాన్ని కుకునూరుపల్లి పోలీసులకు అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం చుట్టూ ఆనవాళ్ళు సేకరించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement