Saturday, May 4, 2024

ట్యాక్స్ చెల్లించని పరిశ్రమలు సీజ్….

.. మున్సిపాల్టీ పరిధిలో 10 లక్షల 50 వేలు బకాయిలు
.. ఈనెల 31 లోపు బకాయిలు చెల్లించాలి
.. మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి

రామాయంపేట – .. గత రెండు సంవత్సరాలుగా ఇండస్ట్రీ పన్ను బకాయిలు చెల్లించని మున్సిపల్ పరిధిలోని ఓ కంపెనీ సీజ్ చేసినట్లు రామాయంపేట మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి సోమవారం విలేకరులతో తెలిపారు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో సుమారు పది లక్షల 50 వేల రూపాయలు ఇండస్ట్రియల్ ప్రాపర్టీ టాక్స్ బకాయిలు ఉన్నట్లు ఆయన తెలిపారు అలాగే మిగతా వారికి కూడా నోటీసులు అందించడం జరిగిందని పేర్కొన్నారు ఈ నెల 31వ తేదీ లోపు ఇటువంటి అపరాధ రుసుము ఉండదని స్పష్టం చేశారు ఈ లోపు ప్రాపర్టీ టాక్స్ చెల్లించని వారు సకాలంలో చెల్లించాలని ఆయన సూచించారు ఎవరైనా మొండికేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ కంపెనీని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు మిగతావారు కూడా ఈనెల 31 లోపు టాక్స్ చెల్లించకుంటే అటువంటి ఈ కంపెనీలు కూడా సీజ్ చేస్తామని శేఖర్ రెడ్డి హెచ్చరించారు. .ఈ కార్యక్రమంలో కాలేరు ప్రసాద్ నవాత్ ప్రసాద్ బిల్ కలెక్టర్ అశ్విత .బల్ల శ్రీనివాస్.ప్రవీణ్.రమేష్ పాలోగోన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement