Tuesday, May 7, 2024

సంక్రాంతికి ఊరెళ్లేవారు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి : సిద్దిపేట సీపీ శ్వేత

సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం, రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాట్లు చేస్తున్నాం దొంగతనాల నివారణకు సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రజలు పండుగకు ఊళ్లోకి వెళ్లేవారు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు.

  1. ఉదయం/పగలు వేళలల్లో పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, తదితర వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలి.
  2. రాత్రివేళ అనుమానంగా కాలనీలో సంచరించేవారి గురించి పోలీసులకు సమాచారం వేంటన అందించాలి.
  3. శివారు కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలి.
  4. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దన్నారు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిదని సూచించారు.
  5. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా చూసుకోవాలన్నారు.
  6. పక్కింటి వారిద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మంచిదన్నారు.
  7. ఇంట్లో కుటుంబసభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని, ఏమరుపాటుగా ఉండవద్దని హెచ్చరించారు.
  8. ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టకపోవటమే మంచిదన్నారు. వాటిని బ్యాంక్‌ లాకర్‌లో పెట్టుకోవాలన్నారు.
  9. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడంమంచిదన్నారు.
  10. పోలీస్‌శాఖ వారికి కొత్తవారి కదలికలపై, దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలని కోరారు.
  11. ప్రత్యేకంగా చుట్టు పక్కల వారి ల్యాండ్‌ఫోన్‌, సెల్‌ఫోన్‌ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.
  12. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు సమీప పోలీస్‌స్టేషన్లను సంప్రదించాలని తెలిపారు.
  13. రాత్రి సమయంలో బీట్, మరియు పెట్రోలింగ్ గస్తి ముమ్మరం చేయబడును,
  14. బయటికేల్లేటప్పుడు తాళలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  15. కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం
  16. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 17. తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీసు స్టేషన్‌ నెంబర్, వీధుల్లో వచ్చే బ్లూ కోల్డ్స్, పెట్రోల్ కార్ పోలీస్ అధికారుల సిబ్బంది స్థానిక వి పిఓ కానిస్టేబుల్ కానిస్టేబుల్‌ నెంబర్‌ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.
  17. బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.
  18. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలి.
  19. గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
  20. బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారు.
  21. ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం.
    .23. విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు.
  22. ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.
  23. గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
  24. ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్‌, పాల వారిని రావద్దని చెప్పాలి.
  25. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి.
  26. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.
  27. ఆరుబయట వాహనాలకు హాండిల్‌ లాక్‌తో పాటు వీల్‌ లాక్‌ వేయాలి.
  28. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం.
  29. టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి.
  30. ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం.
  31. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్/ప్రత్యక్షంగా చూసుకునే వీలుంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సిసిటివి లు ఆన్లైన్/ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. హోమ్ సెక్యూరిటీ సర్వెలెన్స్ కు ఇవి ఎంతో ఉపయుక్తం.
  32. ఇంట్లో, ఇంటి బయట మోషన్ సెన్సర్ లను ఉపయోగించడం మంచిది. ఇంటి బయట మోషన్ సెన్సర్ లైట్లను ఉపయోగించండి. ఇవి చీకటి ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. సెన్సార్లు పరిసరాల్లో ఏదైనా కదలిక గుర్తించగానే లైట్ వెలుగుతుంది.

    సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లో కి వెళ్లేవారు ఈ క్రింది నెంబర్లకు సమాచారం అందించాలి
    సిద్దిపేట ఏసిపి-9490617009,
    గజ్వేల్ ఏసిపి-8333998684,
    హుస్నాబాద్ ఏసిపి-7901640468,
    కంట్రోల్ రూమ్-8333998699,
    డయల్‌ 100 ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు తెలుపగలరు.
Advertisement

తాజా వార్తలు

Advertisement