Tuesday, October 8, 2024

MDK: ఎల్లమ్మ తల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామారెడ్డి

తొగుట; ఎల్లమ్మ తల్లి సల్లంగా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామారెడ్డి లు వేడుకున్నారు. మండలంలోని ఎల్లారెడ్డి పేటలో జరుగుతున్న ఎల్లమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మా మీ చల్లని చూపులు తెలంగాణ మీద ఉండాలని, ఎంపీగా ఘన విజయం అందించాలని ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు.

ఈసందర్భంగా ఆలయ నిర్వాహకులు నరేందర్ గౌడ్, వెంకట్ గౌడ్, ఎల్లగౌడ్ వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, ఎంపీటీసీ వేల్పుల స్వామి, కో అప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, నాయకులు సిరినేని గోవర్ధన్ రెడ్డి, చిలువేరి మల్లారెడ్డి, బక్క కనకయ్య, బీమాసేన, ఇప్ప దయాకర్ భాస్కర్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement