Monday, April 29, 2024

Rashmika: వన్స్‌వెూర్‌….

దక్షిణాది లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు జాతీయ స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప సినిమాలో అద్భుతమైన అభినయం ప్రదర్శించిన రష్మిక బాలీవుడ్‌ సినిమా యానిమల్‌తో క్రేజీ స్టార్‌ అయింది.

- Advertisement -

యానిమల్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రణ్‌బీర్‌ కపూర్‌ కాంబినేషన్‌ తెరపై మెరిసింది. హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట మరోసారి కలిసి నటించనుందని తెలిసింది. అయితే ఇది యానిమల్‌ సినిమాకు
సీక్వెల్‌ కాదట. మరేమిటంటే…ఈ జంట కలిసి నటించేది సినిమా కోసం కాదట. ఓ ప్రకటన కోసం అని తెలిసింది. యానిమల్‌ తర్వాత రష్మిక ఇమేజ్‌ కుర్రాళ్లలో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. ఓ కూల్‌ డ్రింక్‌ ప్రకటనలో వీరిద్దరు కలిసి నటిస్తారని సమాచారం. అయితే స్క్రీన్‌పై రణ్‌బీర్‌, రష్మిక మరోసారి కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement