Saturday, May 11, 2024

TS: పాలమూరును సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ దే.. హరీష్ రావు

సంగారెడ్డి, మార్చి 7 (ప్రభ న్యూస్) : పాలమూరును వ్యవసాయ రంగంలో సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ దేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, తెలుగుదేశం గత పాలనలో చేసిన పనులను బీఆర్ఎస్ 9ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ఒకసారి గమనించాలన్నారు. పాలమూరు వెనుకబాటుతనానికి, పాలమూరు వలసలకు కారణమే, నాటి కాంగ్రెస్, తెలుగుదేశం పాలన అన్నారు. గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ పాప శాపాల పుణ్యమే పాలమూరు వెనుకబాటు తనానికి కారణమన్నారు.

ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పేరే మార్చింది మీరు, మీ కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ పేరు మార్చి చివరకు పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలదన్నారు. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాలను పచ్చబడగొట్టింది కేసీఆర్ అన్నారు. పాలమూరు జిల్లాలో వలసలు వాపస్ వచ్చినై అంటే అది కేసీఆర్ కృషి, అటువంటి కేసీఆర్ ని విమర్శించడం, తిట్టడం అనేది అవివేకమని, దానిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మహబూబ్ నగర్ పైన చిత్తశుద్ధి గనుక ఉంటే ప్రజలకు మేలు చేయాలనుకుంటే ఆరు నెలల్లో నీటి కేటాయింపులు చేయాలన్నారు. ఆ విధంగా పాలమూరుకు బ్రహ్మాండమైన నికరజలాలు వస్తాయన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సంగారెడ్డి జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నరహరి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement