Monday, April 29, 2024

AP – హోదా కోసం ఉద్యమిద్దాం.. కదిలిరండి – షర్మిల పిలుపు

(అమరావతి, ఆంధ్రప్రభ) పదేళ్ల తర్వాతకూడా ప్రత్యేక హోదా ఊసే లేదు, హోదా అంటే ఏంటో అని వింతగా చూస్తున్నారు, అందుకే ఆంధ్రపద్రేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందని ఏపీ పీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల అన్నారు. గత 10 ఏళ్లలో ఏ ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం పోరాడింది లేదు. ఉవ్వెత్తున ఉద్యమించకుంటే ప్రత్యేక హోదా రాదు, ఈ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకుందని వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కాంగ్రెస్ న్యాయ ప్రతిజ్ఞ సభలో గురువారం షర్మిల మాట్లాడారు. ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కుఅని.. హోదా విషయంలో మనం 10 ఏళ్లు గొర్రెలయ్యామని అన్నారు. మనల్ని బలి ఇచ్చారని, తొలి 5 ఏళ్లు చంద్రబాబు, జగన్ మరో 5 ఏళ్లు గొర్రెల్ని చేశారని, ఇప్పుడు మనం గొర్రెలం కాదు సింహాలం అన్నారు. సింహాల లెక్కన పోరాటం చేయక పోతే హోదా రాదన్నారు. మంచితనంతో మౌనంగ ఉంటే మనకు హోదా ఇచ్చారా ?.. మంచితనంగా ఉంటే పోలవరం కట్టారా?.. ఆంధ్రులను మోసం చేసిన మోడీ ఒక డి ఫాల్టర్ అని మండిప‌డ్డారు. మోడీ ఒక కేడీ అని షర్మిల తీవ్ర పదజాలంతో విమర్శించారు.

రాష్ట్ర అభివృద్ధి వారికి ప‌ట్ట‌లేదు..

అభివృద్ధిలో ఎక్కడో ఉండే వాళ్ళం.. చంద్రబాబుకి రాష్ట్ర అభివృద్ధి ప‌ట్ట‌లేదు. రక్తం పంచుకు పుట్టిన జగన్ అన్నకి అభివృద్ధి ధ్యాస లేదు, మాట ఇచ్చి మడతపెట్టిన ఘనత జగన్ ది అని ష‌ర్మిల విమ‌ర్శించారు. జలయజ్ఞం కింద వైఎస్ఆర్ కట్టిన ప్రాజెక్ట్ లకి దిక్కులేదు, అని తూర్పారబట్టారు. హోదా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, మన రాష్ట్రానికి భవిష్యత్ లేనే లేదు, ప్రత్యేక హోదా మనకు ఊపిరి అన్నారు. ఊపిరి లేకుండా బ్రతక గలమా ? రాష్ట్రమంతా కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. –

బాబు, పవన్, జగన్‌పై షర్మిల బాణాలు

ప్రజలను ప్రత్యేక హోదా నుంచి పక్క దారి పట్టించారు. బీజేపీ కి రాష్ట్రంలో ఒక్క ఎంపీ లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడు.. అయినా రాష్ట్రంలో బీజేపీ రాజ్యమేలుతోంద‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు. బాబు,జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిప‌డ్డారు. బాబు అధికారంలో ఉంటే బీజేపీ ఉనట్లే.. జగన్ ఉన్నా బీజేపీ ఉన్నటేనని, 10 ఏళ్లు దాటిన మనకు రాజధాని లేద‌న్నారు. హైదరాబాద్ 10ఏళ్లు ఇస్తే అవసరం లేదని ఉరుక్కుంటూ వచ్చారు. ఇక్క‌డ ఒకటి లేదు, మూడు లేదు. ఇది మన రాష్ట్రానికి సిగ్గు చేటని షర్మిల ఆవేశంగా విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement