Tuesday, April 30, 2024

అప‌ర భ‌గీర‌థుడు కెసిఆర్ – ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి

మెదక్‌, ప్రభ న్యూస్‌ ప్రతినిధి : గోదావరి నీళ్లను తెలంగాణ బీడు భూములకు మళ్లించి జీవం కోల్పో యిన ఎన్నో చెరువులు, కాలువలు, ఉపనదులకు పున రుజ్జీ వం కల్పించే దిశగా కృషి చేసి, ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ అపర భగీరథునిగా నిలిచారని కేసీఆర్‌ ప్రియ శిష్యు డు, ఉద్యమకాలం నుండి ముఖ్యమంత్రితో 22 ఏళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసిన కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అభిప్రా యప డ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికల ఫలితంగా మెదక్‌ జిల్లాలో చెరువులు, కాలువలు, చెక్‌డ్యామ్‌ల ు జలకళను సొంతం చేసుకున్నాయని ఆయన తెలి పారు. కాళేశ్వరం నీరు మంజీరా ద్వారా నిజాంసాగ ర్‌లోకి మళ్లించిన సందర్భంగా విలేకరులతో చిట్‌ చాట్‌గా మాట్లాడారు.
ప్రశ్న: మంజీరాపై నిర్మించిన చెక్‌ డ్యామ్‌ వల్ల కాళేశ్వరం జలాలతో ఎంత ప్రయోజనం ఉంది?
శేరి : కొండపోచమ్మ సాగర్‌ నుండి 4 పెద్ద చెరు వులు, 70కిలోమీటర్ల హల్దిdవాగులో 30 చెక్‌ డ్యామ్‌లు, బొల్లారం మత్తడి, మంజీరాలో పూర్తయిన చెక్‌డ్యా మ్‌, నిర్మాణంలో ఉన్న చెక్‌ డ్యామ్‌ 40 కిలోమీటర్ల మే ర విస్తరించి ఉంది. 70 కిలోమీటర్ల హల్దీ , మంజీరాల్లో ఎటు 3 కిలోమీటర్ల మేర భూగర్భ జలా ల నీటి మట్టం పెరగనుంది.
ప్రశ్న : వేసవికాలంలో కాళేశ్వరం జలాలు మెదక్‌ జిల్లాకు వస్తాయని ఎవరైనా ఊహించారా.?
శేరి : వాస్తవమైతే ఇది ఊహకు అందని విషయం. ఇది కేవలం తెలంగాణ రైతాంగాన్ని ఆర్థికంగా ఎది గేలా చేయడానికి అపర భగీరథుడు కేసీఆర్‌ ముందు చూపు ఫలితమే. 22 ఏళ్ల పాటు కేసీఆర్‌ వెంట ఉన్న ఓ నిబద్ధత గల కార్యకర్తగా నేను మాత్రం కేసీఆర్‌ గోదావరి నీళ్లను మెదక్‌ జిల్లాకు తప్పకుండా తెప్పి స్తారని మాత్రం నమ్మాను.
ప్రశ్న : కాళేశ్వరం నీరు రెండు పంటలకు నిరం తర వ్యవసాయానికి అందుబాటులో ఉంటాయా.?
శేరి : ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ ప్రయత్నమంతా రైతు గర్వంగా సమాజంలో తలె త్తుకొని బతకాలన్నదే. అయితే రెండు పంటలకు నీరందించడం మూలంగా ఇక్కడ నీటి కొరత రాదు.
ప్రశ్న: ఎక్కడైనా నది నీళ్లు ఉపనదిలో కలిసిన సందర్భాలున్నాయా.?
శేరి: నాకు తెలిసి ఎక్కడైనా ఉపనదులే నదులకు జీవధారలుగా ఉంటాయి. కానీ గత పాలకుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఉపనదులన్నీ ఒట్టి పోయాయి. కొన్నిచోట్ల నీటి లభ్యత లేక పిచ్చిమొక్కలతో నిండాయి.
ప్రశ్న: కాళేశ్వరం జలాల వల్ల పర్యావరణం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు.?
శేరి : ఈ నదుల ద్వారా నది పరీవాహక ప్రాంత మంతా నీటి లభ్యత ఉండటం మూలంగా ఆహ్లాద కరమైన వాతావరణం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement