Wednesday, May 15, 2024

స్మశాన వాటిక ఆక్రమణ..

రామాయo పేట : పట్టణంలోని స్మశాన వాటిక ఆక్రమణకు గురికాకుండా చూడాలని మండపేట సగర సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని సుమారు రెండు ఎకరాల మేర ఉన్న స్మశాన వాటిక రోజురోజుకు ఆక్రమణకి గురిఅవుతుందని చెప్పారు. రామన్నపేట పట్టణంలో దాదాపు 23 వేల జనాభా ఉందని పేర్కొన్నారు. పట్టణంలోని సుభాష్ విగ్రహం నుండి బిసి కాలాని మరియు సాయిరాం థియేటర్ వరకు 70 శాతం గ్రామం ఉందన్నారు అయితే సుభాష్ విగ్రహం వద్ద గ్రామంకి సంబంధించిన రాతి గడప ఉన్నందున సుభాష్ విగ్రహం నుండి అన్ని వర్గాల ప్రజలు దహనసంస్కారాలు నిమిత్తం మెదక్ రోడ్డు లో సర్వే నెంబర్ 12 8 3 లో సుమారు రెండు ఎకరాల్లో స్మశాన వాటిక వినియోగించుకుంటున్నామన్నారు. గతంలో మెదక్ రోడ్డు ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉండేవని వాటి విలువ పెరిగినందున కొందరు దళారులు వాటిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కొందరు స్మశాన వాటికను అక్కడినుండి తరలించడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం గౌరవ అధ్యక్షులు మర్కుక్ దత్తు సాగర్, దోమకొండ యాదగిరి, మర్కుక్ నర్సింలు, శ్రీరంగం వరకు యాదగిరి యూసుఫ్ పేట సిద్ధరాములు, మార్కు రాములు, తిరుమలయ్య సగర సంఘం రెండవ బేడ అధ్యక్షులు దోమకొండ సిద్ధరాములు, వర్కు యాదగిరి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement