Monday, May 13, 2024

జర్నలిస్టులకు ఇండ్లు, కార్లు, ప్లాట్లు ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : జగ్గారెడ్డి

సంగారెడ్డి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్ట్ లైన ప్రింట్, ఎలక్ట్రానిక్, వీడియో జర్నలిస్ట్ లకు, ఫోటో జర్నలిస్ట్ లకు ఇండ్లు, కార్లు, ప్లాట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని, ప్రభుత్వం స్పందించి వారికి ఆ విధంగా ఇస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సతీష్ రెడ్డిలతో చిట్ చాట్ సందర్బంగా ఈ వ్యాఖ్య‌లు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్ట్ లతో పాటు రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులంద‌రికీ ప్లాట్ లు, ఇండ్లు, కార్లు ఇవ్వాలని అన్ని ఇస్తే ఒక టర్మ్ పోటీ చేయను, త‌న నియోజకవర్గ ప్రజలకు కూడా ఇదే విషయం చెప్పి వచ్చే ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటానని తెలిపారు. తాను గతంలో టీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా జర్నలిస్ట్ లకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే సీఎం కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని ఆయ‌న‌ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement