Sunday, April 28, 2024

RMP & PMP డాక్టర్ల సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే పెద్ది

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి RMP & PMP డాక్టర్ల సమస్యలపై మాట్లాడారు. ఆర్ఎంపీ, పిఎంపి డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం పేదలకు వైద్యం అందించడంలో ముందు వరుసలో ఉన్నారని అన్నారు. గతంలో కొన్ని ఫెజ్ లలో వారికి ట్రైనింగ్ ఇవ్వడం, సర్టిఫికెట్లను ప్రదానం చేయడం జరిగిందని, కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ట్రైనింగ్ ఇవ్వడం అనేది వాయిదా పడిందని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు వేలాది పోస్టులు భర్తీ చేయనున్నారు కాబట్టి వారికి తగిన గుర్తింపు ఇచ్చి ఎదోక పద్ధతిలో వారిని రిక్రూట్ చేసుకొని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు.

ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు గౌరవ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు  సమాధానమిస్తూ… ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్ల సమస్య ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. త్వరలోనే గౌరవ సభ్యులను పిలిచి మీటింగ్ పెట్టి ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement