Friday, April 26, 2024

అవకాశాలను అందిపుచ్చుకోవాలి.. ఆత్మవిశ్వాసంతో చదివి మీ లక్ష్యాన్ని చేరాలి : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : సిద్దిపేట్ బీసీ స్టడీ సర్కిల్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రూప్ వన్ కి రెండు వందల మంది, కానిస్టేబుల్ కి 100 మంది శిక్షణ పొందుతున్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ క్లోజ్ అని బోర్డ్ కనిపిస్తుంది.. ప్రైవేట్ పాఠశాలలను తల తన్నెలా అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్నాం అంటే అది తెలంగాణ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమన్నారు. నాడు 142 మంది ఉన్న ఇందిరా నగర్ స్కూల్ లో నేడు పన్నెండు వందల మంది విద్యార్థులు ఈరోజు సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నరన్నారు.

సిద్దిపేట్ బీసీ స్టడీ సర్కిల్లో చదువుకొని 318 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధపడుతున్న వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని ఓటమితో ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగుతూనే విజయం సాధ్యమవుతుంది అది నా వ్యక్తిగత అనుభవంతో విద్యార్థులకు చెప్తున్నాన్నారు. ప్రభుత్వం స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు పెంచి 91000 ఉద్యోగాలు తెలంగాణ యువతకు పొందే లాగా నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. దశలవారీగా అందరూ విద్యార్థులు పోటీపడే విధంగా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుందని చెప్పారు.

గ్లోబలైజేషన్ లో ప్రపంచం చిన్నగా మారిపోయింది ప్రభుత్వ ఉద్యోగాలు రాని వారు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి దాని కోసం కార్పొరేట్ ఉద్యోగాలకు వెళ్లే వారి కోసం సాఫ్ట్ వేర్ రంగంలో ఆసక్తి ఉన్న వారికి కోచింగ్ ఇప్పిస్తాను, విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు కోసం ఉచితంగా ఓవర్సీస్ శిక్షణ ఇప్పించి వీసా ప్రాసెస్ చేసి చదువుకోడానికి విదేశాలు పంపిస్తానన్నారు.. కష్టపడే విద్యార్థులకు తాను ఎప్పుడూ తోడుగా ఉంటానని మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాలిగా ఉన్న ఉద్యోగాలు నోటిఫికేషన్ లు వేయాలని ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు.. ప్రయివేటు రంగంలో అనేక ఉద్యోగాలు ఉన్నాయని అందుకు కావాల్సిన శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. సిద్దిపేట విద్యాక్షేత్రంగా విరాజిల్లుతున్నది అని..భావి తరాలకు భవిత ఇవ్వాలి నే ఉద్దేశ్యం తో సిద్దిపేట కు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూన్నామని, త్వరలోనే బిసి స్టడీ సర్కిల్ శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు.. మంచిగ చదువు కొని ఉద్యోగాలు సాదించాలని తెలియజేసారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement