Sunday, May 5, 2024

Breaking | యువకుడి పై కానిస్టేబుల్ దాడి….

చేర్యాల: చేర్యాల పట్టణానికి చెందిన బుట్టి నవీన్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి టీ తాగడానికి ఇంటి సమీపంలోని టీ స్టాల్ వద్దకు వెళ్లగా అదే సమయంలో అక్కడికి పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో గోవర్ధన్ అనే కానిస్టేబుల్ నవీన్ వద్దకు రాగా టీ తాగుతున్న నవీన్ ని పోలీసులు వస్తే లేచి నిల్చోవారా నీకు అంత బలుపు ఎందుకురా అని దూషిస్తూ అతనిపై భౌతికంగా దాడి చేస్తూ అరగంటకు పైగా పోలీస్ వాహనంలో వేసి కొట్టినట్టుగా నవీన్ చేర్యాల పోలీస్ స్టేషన్ లో గోవర్ధన్ అనే కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. తనను అకారణంగా దూషించి చిత్రహించకు గురిచేసిన కానిస్టేబుల్ పై చట్టపరంగా చర్యలు తీసుకోమని నవీన్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement