Sunday, May 5, 2024

వోక్సెన్ యూనివర్సిటీతో పలు విద్యాసంస్థల ఒప్పందాలు

సంగారెడ్డి : వోక్సెన్ విశ్వవిద్యాలయంతో పలు విద్యా సంస్థలు బుధవారం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సంగారెడ్డి పరిధిలోని మునిపల్లి మండలం కామ్‌కోల్‌లోని వోక్సెన్ విశ్వవిద్యాలయంలో గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్ 2022 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశంలో మూడు కొత్త సహకారాలు విద్యార్థులకు అభ్యాస అవకాశాలను మెరుగుపరచనున్నాయి. శిఖరాగ్ర సదస్సు నాలుగో రోజైన బుధవారం ఈ మూడు ప్రకటనలు వెలువడ్డాయి. వోక్సెన్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజైన్, బనారస్ హిందూ యూనివర్శిటీ (BHU), జాయింట్ రీసెర్చ్, ట్రైనింగ్, వర్క్‌షాప్‌లు, కాన్ఫరెన్స్‌ల రంగాలలో సహకరించడానికి అంగీకరించింది. BHU సహకారంతో డిజైన్ ఇన్నోవేషన్ ల్యాబ్ కూడా సెటప్ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. బి హెచ్ యూ కోఆర్డినేటర్ మనీష్ అరోరా మాట్లాడుతూ… MOU (మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) ద్వారా ఈ సహకారాన్ని ఖరారు చేయడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టవచ్చని ఆయన తెలిపారు. ఇదొక గొప్ప అవకాశంగా మనీష్ అభివర్ణించాడు. బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రభుత్వ సంస్థ అని, అందువలన ప్రభుత్వపరమైన అనుమతులు తీసుకొని ఒప్పందంపై సంతకం చేయడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement