Sunday, April 28, 2024

నిజాం నిరంకుశ పాల‌న‌కు వ్య‌తిరేకంగా.. సామాన్యులే సాయుధులై పోరాటం : మంత్రి త‌ల‌సాని

మెదక్ : ఆనాడు నిజాం నిరంకుశ పాల‌న‌కు వ్య‌తిరేకంగా మెద‌క్ జిల్లా నుంచి ఎంద‌రో యోధులు పోరాటం చేశార‌ని మంత్రి త‌ల‌సానిశ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. మెదక్ కలెక్టరేట్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ముఖ్య అతిథిగా హాజ‌రై జాతీయ జెండా ఎగుర‌వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జడ్పి ఛైర్ పర్సన్ హేమలత జిల్లా కలెక్టర్ హరిశ్ , అడిషనల్ కలెక్టర్లు రమేష్,ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామ‌న్నారు. సెప్టెంబర్ 17న జరిగే జాతీయ సమైక్యత ఉత్సవాల ప్రాధాన్యత ప్రజలకు, విద్యార్థులకు తెలియజేయాల‌న్నారు. హైదరాబాద్ సంస్థానంగా ఉన్న మనం 1947 సెప్టెంబర్ 17న విలీనం అయ్యామ‌న్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మెదక్ జిల్లాలో ఎంతో మంది యోధులు ఉన్నార‌న్నారు. హిందు దేవాలయాల్లో పూజలు చేయవద్దని నిజాం చెబితే నైజం సర్కార్ ఆంక్షలను ధిక్కరించి ఆగస్టు 15న జాతీయ జెండాలను రెపరేపాలదించారు అన్నారు. 3 రోజుల పాటు జాతీయ సమైక్యత వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామ‌ని, రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా వంటి బృహత్తర పథకాలు అందజేస్తున్నామ‌న్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంద‌న్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement