Friday, May 10, 2024

ఘ‌నంగా ప్రారంభ‌మైన‌ మహిళా క్రీడా పోటీలు

మూడు రోజుల పాటు జరగనున్న పోటీలు
క్రీడా పోటీలను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చొరవ ప్రశంసనీయం
మహిళా సాధికారికతకు కృషి – జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి
హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు – అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మైత్రి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి, క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 74 సంవత్సరాలు గడుస్తున్నా మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారికత కు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అని కొనియాడారు. మహిళల కోసం నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మూడు రోజులపాటు క్రీడా పోటీలు నిర్వహించి, చివరి రోజైన సోమవారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ముగింపు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రీడా రంగం వైపు మహిళలను ప్రోత్సహించాలన్న సమున్నత లక్ష్యంతో పోటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీలు దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, సుప్రజ వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు రోజా బాల్ రెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, లలితా సోమిరెడ్డి, కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్ , సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, మహిళా ప్రజాప్రతినిధులు, మహిళ అధికారులు, ఉద్యోగినులు, ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ మండల పట్టణ, అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement