Tuesday, May 21, 2024

TS: ఈ ఎన్నిక‌ల్లో ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా… కేసీఆర్

ఎన్డీఎ, ఇండియా కూట‌మిని ప్ర‌జ‌లు న‌మ్మ‌రు
లిక్క‌ర్ స్కామ్ మోదీ సృష్టి
కేజ్రీవాల్, క‌విత‌లిద్ద‌రూ అమాయ‌కులే
న్యాయ స్థానాల‌పై న‌మ్మ‌కం ఉంది
ఇద్ద‌రు క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వ‌స్తారు
బీజేపీకి పూర్తి స్థాయిలో ఎప్పుడూ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు
జాతీయ మీడియాతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

హైద‌రాబాద్ – ఈ లోక్ సభ ఎన్నిక్లలో ప్రాంతీయ పార్టీలే బలమైన పక్షంగా నిలబోతున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అధిక స్థానాలు కైవసం చేసుకునేది ప్రాంతీయ పార్టీలేన‌ని, అందులో ఎటువంటి సందేహం లేద‌న్నారు.. జాతీయ మీడియాకు ఇవాళ‌ ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ…. ఇండియా, ఎన్డీయే ఈ రెండు కూటముల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని, ఈ రెండు కూట‌ములు ఈ ఎన్నిక‌ల్లో దెబ్బ‌తింటాయ‌నే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.. లిక్క‌ర్ స్కామ్ పై మాట్లాడుతూ.. ఈ స్కామ్ సృష్టి క‌ర్త మోదీనే అంటూ ఆరోపించారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్ర‌ధాని క్రూరమైన ఆట ఆడుతున్నారని, ఇందులో ఎటువంటి స్కామ్ లేదని అన్నారు.

ఈ కేసులో కవిత, అరవింద్ కేజ్రీవాల్ అమాయకులు అని, ఇది కేవలం పొలిటికల్ గేమ్ అని కొట్టిపారేశారు. రాష్ట్రం రూపొందించుకున్న లిక్కర్ పాలసీని స్కామ్ అని ఏ ఫూల్ అంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన లిక్కర్ పాలసీలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కేసులో నయా పైసా రికవరీ చేయలేదని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐలు బీజేపీకి అనుబంధ సంస్థలుగా పని చేస్తున్నాయని ఆరోపించారు. తమకు కోర్టులపై నమ్మకం ఉందని కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అటు కేజ్రీవాల్, ఇటు క‌విత‌లు క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వ‌స్తారని అన్నారు..

బీజేపీతో బీఆర్ఎస్ సీక్రెట్ గా ఒప్పందం కుదుర్చుకున్నాయని, ప్రతి సందర్భంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంపై కేసీఆర్ స్పందిస్తూ, బీజేపీకి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఎప్పుడూ అండగా లేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళలో కేంద్రంతో రాజ్యాంగపరమైన సత్సంబంధాలు కొనసాగించామన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోరితేనే తాము మద్దతు ఇచ్చామని అదే సమయంలో రైతు చట్టాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విజ‌యం పాల‌పొంగులాంటిద‌ని వ్యాఖ్యానించారు.. త‌మ కంటే ఎక్కువ నిధులు ఇస్తానంటే ఆశ‌ప‌డి తెలంగాణ ప్ర‌జ‌లు కాంగ్రెస్ ను గెలిపించార‌ని అన్నారు… అయిదు నెల‌లోనే కాంగ్రెస్ చేసిన మోసం ప్ర‌జ‌లు అర్ధం చేసుకున్నార‌ని, ఈ ఎన్నిక‌ల‌లో ఆ పార్టీకి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌న్నారు… రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని, తాము తిరిగి పుంజుకుని అధికారంలో వ‌స్తామ‌ని కెసిఆర్ విశ్వాసం వ్య‌క్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement