Sunday, April 28, 2024

విద్యార్థులకు సీజనల్‌ వ్యాధులు రాకుండ చర్యలు : కొప్పుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సీజనల్‌ వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని షేక్‌పేట ఎస్సీ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్‌ కాలేజీ (సెంటర్‌ ఫర్‌ ఎక్సెలెన్స్‌ – సీవోఈ )ని మంత్రి కొప్పుల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, కిచెన్‌ హాల్‌, డైనింగ్‌ రూం, టాయిలెట్స్‌, కారిడార్స్‌ పరిసరాలను ఆయన పరిశీలించారు. విద్యార్థుల ఆలనాపాలనపై ఆరా తీశారు.

తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ గురుకుల హాస్టళ్ళలో చదువుకుంటున్న విద్యార్థులను సొంత బిడ్డల మాదిరిగా చూసుకోవాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. గురుకుల విద్యావిధానంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యాబుద్ధులతో పాటు మంచి పోషకాహారన్ని అందజేస్తున్నామని అన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై ప్రతి ఏటా లక్షా 25 వేల రూపాయలను ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement