Monday, May 6, 2024

BREKING : బాల్యంలోనే పెళ్లి…మ‌న‌స్తాపంతో ఆత్మ‌హ‌త్య‌….

బాల్య వివాహాల నిర్మూల‌న‌కు ఎంత కృషి చేసిన ఎక్క‌డో అక్క‌డ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. చిన్న‌త‌నంలో పెళ్లి వారికి శాపంగా మారుతుంది. త‌మ ల‌క్ష్యాన్ని ఎంచుకున్న క‌న్న‌వారు క‌నిక‌రించ‌క‌పోవ‌డంతో త‌ప్ప‌క త‌ల‌వంచి తాళి క‌ట్టించుకొని జీవితాల‌ను కొల్పోతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే తాజాగా మెద‌క్ జిల్లాలో చోటుచేసుకుంది.

- Advertisement -

వివ‌రాల్లోకి వెళ్లితే.. మెద‌క్ జిల్లా టెక్మాల్ మండ‌లంలో బాల్యం వివాహాం చేశార‌నే తీవ్ర మ‌న‌స్తాపానికి గురై న‌వ వ‌ధువు తానువు చాలించింది. ఈఘ‌ట‌న బుధ‌వారం తెల్ల‌వారు జామున చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికకు ఈ నెల 4న తన మేనబావతో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అయితే, ఆ పెళ్లి బాలికకు ఇష్టం లేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. తాను చదువుకుంటానని చెప్పినా చిన్న వయసులోనే తనకు పెళ్లి చేశారంటూ బాత్ రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement