Saturday, May 4, 2024

వాసవి మాతకు ప్రత్యేక పూజలు..

దేవరకద్ర : మండల కేంద్రంలో స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరిశంకర్‌ శర్మ అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలతో పూలతో అలంకరణ చేశారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో మహిళలు కుంకుమార్చన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కన్నయ్య , విశ్వనాథం , లక్ష్మీ నారాయణ , సుదర్శన్‌ , వెంకట్రాములు , హరికాంత్‌ , కిషోర్‌ , రఘు , నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement