Monday, May 6, 2024

తలైవి సాంగ్ ను విదుదల చేసిన సమంత

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధానపాత్రలో జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. కాగా ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది. ఇలా ఇలా అంటూ సాగే ఈ పాటను శుక్రవారం సమంత విడుదల చేశారు. తెలుగు తమిళ్ హిందీ మూడు భాషల్లో ఈ పాట విడుదలైంది. ఈ సందర్భంగా సమంత మూడు భాషలకు మూడు భాషలలో పాటకు సంబంధించిన లింక్ లను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

అమ్మ దయ, జాలికి ఏదీ సాటి లేదని అందరి తెలుసు. ఆమె జీవిత కథ పై ఈ సినిమా తెరపైకెక్కతున్న విషయం తెలిసిందే. సినిమా నుంచి సీఎం దాకా అమ్మ ఎలా ఎదిగారు, ఆమెకు ఎదురైన చేదు అనుభవాలను ఈ చిత్రం అభిమానులకు సాక్ష్యం ఇవ్వబోతోంది అంటూ సమంత ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement