Wednesday, May 15, 2024

ST Status – వాల్మీకుల‌ను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత నాది- డికె. అరుణ

జోగులాంబ గద్వాల (ప్రతినిధి) జూన్ 24 (ప్రభ న్యూస్) – ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత నాది అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ హామీ ఇచ్చారు. నేడు డికె.అరుణ ను కలిసి ఎస్టీలో చేర్చడంపై చర్చించారు వాల్మీకి సోదరులు. ఈ సంద‌ర్బంగా బోయ వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యత నాది అని. వాల్మీకి సోదరులందరూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే ఆ బహిరంగ సభలోనే సంబంధిత కేంద్ర మంత్రిచే హామీ ఇప్పించి ఎస్టీ జాబితాలో చేర్పిస్తాననివారికి హామీ ఇచ్చారు. డికె.బంగ్లాలో వాల్మీకి సోదరులు ఈ మేర‌కు డికె. అరుణ ని కలిసి వినతి పత్రం సమర్పించారు..

ఈ సందర్భంగా వారితో డికె. అరుణ సుదీర్ఘంగా చర్చించి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి వాల్మీకుల బిల్లులోనే మరొక రిజర్వేషన్లు కూడా కలిపి మోసం చేసిందని విమర్శించారు. ఈ ఏడాది కూడా వాల్మీకి సోదరులతో పాటు ఖైతి లంబాడి, వాలి కులాలను కూడా కలిపి బిల్లును కేంద్రానికి పంపారని అన్నారు. వాల్మీకుల ఓట్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మీతో నాటకలాడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని అన్నారు. గద్వాల అభివృద్ధి డికె. అరుణ తోనే సాధ్యమైందని వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం కూడా తానే చేయిస్తానని ఇది తాను మనస్ఫూర్తిగా ఇస్తున్నటువంటి హామీ అని ఆమె భరోసా కల్పించారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, కౌన్సిలర్లు గుర్రం నరసింహులు, సర్పంచ్ హన్మంత్, వాల్మీకి సోదరులు వైండింగ్ రాములు, దాసు, రామచంద్రుడు, నెమలి కంటి రామంజి, సంఘాల నర్సింలు, ఉలిగేపల్లి సవరన్న, బాలు, తోట రాములు, మహేష్ నాయుడు, సద్దల్ రాములు, సురేష్ , సుధాకర్ నాయుడు, జమ్మన్న, రఘు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement