Thursday, May 2, 2024

తెలంగాణలో అభివృద్ధి ఏది ? ఉద్యమకారుడు గా కెసిఆర్ కలరింగ్ – నాగం జనార్ధన్ రెడ్డి

—- ఫిబ్రవరి 28 మరచిన ముఖ్యమంత్రి
—- ఇచ్చిన హామీలు నిలబట్టుకొని కెసిఆర్
— ప్రత్యేక రాష్ట్రం కోసం లాటి దెబ్బలు జైలు పాలై అయ్యాం … మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 20) ప్రభ న్యూస్.. రాజ్యసభలో ప్రత్యేక రాష్ట్రానికి ఆమోదించిన రోజు ఫిబ్రవరి 20వ తేదీ అని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి నివాస గృహంలో అమరవీరుల ఒక నిమిషం మౌనం పాటించారు అనంతరం ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 18 లోక్సభలో 20వ తేదీ రాజ్యసభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆమోదింప చేసిన రోజు అని అందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. అందుకు సహకరించిన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి, సుష్మ స్వరాజ్ మరియు అరుణ్ జెట్లీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెడితే ప్రత్యేక రాష్ట్ర ఆశలకు పునాదిపడిన రోజును మరిచిన కేసీఆర్ ,ఉద్యమకారుడు అని చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు.

తొలి దశ 1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది, మలిదశ ఉద్యమంలో 1200 మంది పైచిలుకు ఉద్యమకారులు ఆత్మబలిదానం చేసుకొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మాట నిలబెట్టుకొని కెసిఆర్ కు నమ్మిన తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోయారని తెలిపారు. అభివృద్ధి చేస్తాడని నమ్మిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రి రాష్ట్రం నేనే తెచ్చానని ఉద్యమాన్ని ఎడిట్ చేసుకున్నాడని తెలిపారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ టిడిపి పార్టీలతో పెట్టుకొని వచ్చిన కొద్దిపాటి సీట్లతో రాజీనామాలు చేయించి ఫార్మ్ హౌస్ లో సేద తీరుతూ ఉద్యమం చేస్తున్నాని కెసిఆర్ కలర్ ఇవ్వడమే తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. 1969 ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి లాటి దెబ్బలు తిని జైలుకు వెళ్లారని తెలియజేశారు. నాటి ఉద్యమంలో వందలాదిమంది ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో నా కళ్ళముందే అమరులయ్యారని భావోద్వేగం నికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, తాడూరు జడ్పిటిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రోహిణి గోవర్ధన్ రెడ్డి, నాగం శశిధర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement