Friday, April 26, 2024

లాల్‌కోటలో లాక్‌డౌన్‌..

దేవరకద్ర : నియోజకవర్గ పరిధిలోని చిన్నచింతకుంట మండలంలోని లాల్‌కోట గ్రామంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు గ్రామపంచాయితీ సమావేశంలో తీర్మానం చేశారు. రోజు రోజుకు కరోనా వైరస్‌ కేసులు ఎక్కువ అవుతున్నందుకు దీన్ని దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. ప్రజలు అందరూ కూడా లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకూడదని అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని సభ్యులు కోరారు. ప్రతి ఒక్కరు కూడా మాస్కు ధరించి భౌతిక దూరాలను పాటించాలని వారు కోరారు. లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని వారు ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement