Monday, April 29, 2024

ప్రియాంకా చోప్రా వల్ల అవకాశాలు రాలేదు: మీరా చోప్రా

బంగారం ముద్దుగుమ్మ మీరా చోప్రా తన కెరియర్ తొలినాళ్ళలో జరిగిన పలు ఆసక్తికర విషయాలను జూమ్ టీవీ తో పంచుకున్నారు. తన కజిన్, బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా వల్ల తాను సినీ అవకాశాలను కోల్పోయానంటూ నటి మీరా చోప్రా కామెంట్స్ చేశారు. తాను బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పుడు… ప్రియాంక సోదరి వచ్చిందంటూ ఎంతో ప్రచారం జరిగిందని మీరా తెలిపారు. అయితే తాను ఆమెతో ఎలాంటి కంపారిజన్స్ పెట్టుకోలేదని చెప్పారు. ప్రియాంక వల్ల తనకు అదనంగా ఎలాంటి అవకాశాలు రాలేదని తెలిపారు. తనకు అవకాశాలిచ్చే నిర్మాతలు కావాలని… కానీ, ప్రియాంక వల్ల తనకు పని దొరకలేదని చెప్పారు. ప్రియాంక బంధువుని అయినంత మాత్రాన తనకు కెరీర్ పరంగా లాభించింది ఏమీ లేదని అన్నారు. ఇది కూడా తనకు మేలే చేసిందని… అందరూ తనను ఆమె సోదరిగా కాకుండా, ప్రత్యేకంగా చూశారని..తాజాగా జూమ్ టీవీతో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తెలుగులో పవన్ కల్యాణ్ చిత్రం ‘బంగారం’తో పాటు,’వాన’ తదితర చిత్రాల్లో కూడా ఆమె నటించి, మెప్పించారు. 2005లో బాలీవుడ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన మీరా… ఆ తర్వాత పలు చిత్రాలలో నటించారు. ఇక మీరా చివరిసారిగా ‘సెక్షన్ 375’ అనే వెబ్ సిరీస్ లో కనిపించారు. ప్రస్తుతం అర్జున్ రాంపాల్ తో కలిసి ‘నాస్తిక్’ అనే చిత్రంలో ఆమె నటించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement