Friday, May 3, 2024

జూరాల‌కు వరద ఉధృతి

మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ కు మరోసారి వరద ఉధృతి పెరిగింది. అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 58,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 73,717 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి సామర్థ్యం 8.068 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.720 అడుగులకు గాను… ప్రస్తుత నీటి మట్టం 317.700గా నమోదు అయ్యింది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్‌లో 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అలాగే దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్‌లో 240 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement