Sunday, May 5, 2024

కమ్మారెడ్డిపల్లిలో పర్యటించిన డా. కె. సుధాకర్ లాల్..

తెలకపల్లి : మండలం కమ్మారెడ్డి పల్లిలో కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయిన 42 మంది బాధితుల ఇంటి ఇంటికి తిరుగుతూ వారి ఆరోగ్య పరిస్థిని.. వారి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. సుధాకర్ లాల్.ఈ సందర్భంగా జిల్లా వైద్య .. ఆరోగ్య శాఖ అధికారి డా. కె. సుధాకర్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పాజిటివ్ నిర్దారణ అయిన వారు హోమ్ ఐసోలాషన్ లో ఉండాలని.. వైద్య సిబ్బంది సూచించే ఆరోగ్య సలహాలు పాటించాలని ఆందోళన చెందొద్దని.. వైద్యులు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉన్నారని ఏ విధమైన అత్యవసర పరిస్థితులు ఉన్న తక్షణమే స్పందిస్తామన్నారు. సాధారణ ప్రజలు సైతం అత్యవరమైతే తప్ప బయటికి రావద్దని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా ప్రమాదం పొంచి ఉందన్న నిజాన్ని గుర్తించాలని అన్నారు. అనుమానితులు అందరూ పరీక్షలు చేయించుకొని జాగ్రత్తగా ఉండాలని, పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని.. పాజిటివ్ నిర్దారణ అయినవారితో ఏమాత్రం కలిసామన్న అనుమానం ఉన్నా, లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవాలన్నారు.. టెస్టింగ్, ట్రీట్మెంట్ ద్వారానే కరోనాని నివారించగలుగుతామని సూచించారు.
ఒక్క కమ్మారెడ్డి పల్లి గ్రామంలోనే 42 మంది బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో సాధారణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. మాస్కులు ధరించడంతో పాటు చేతులని తరచు శుభ్రం చేసుకోవాలని.. భౌతిక దూరం పాటించాలని జన సమూహాల్లోకి వెళ్ళొద్దని యువత బాధ్యత తో మెలగాలని జిల్లాలోని పౌరులు అందరూ క్రమం తప్పకుండా ప్రభుత్వ సూచనలు పాటించాలని వైద్య సిబ్బందికి సహకరించి కోవిడ్ వ్యాప్తిని అరికట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో వైద్య అధికారి డా. ప్రదీప్, సూపర్ వైజర్ ఫాసియోద్దీన్.. వైద్య సిబ్బంది.. ఏ.ఎన్. ఎంలు ఆశా కార్యకర్తలు, పోలీస్ శాఖఅధికారులు, సిబ్బంది గ్రామ ఉప సర్పంచ్ జానకి రాంరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement