Tuesday, April 30, 2024

దేవరకద్ర లో ధర్నా


దేవరకద్ర : కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమొక్రసి సిపిఐ నాయకులు కొత్త బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేయడానికి నూతన వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకురావడం జరిగిందని నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ధర్నా వల్ల అటువైపు వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఈవిషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ భగవంత రెడ్డి , పోలీస్‌ సిబ్బందితో అక్కడికి వెళ్లి ధర్నా చేస్తున్న వారిని విరమింపజేశారు. తదుపరి రాకపోకలు యథావిధిగా కొనసాగేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాంబ శివుడు , సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement