Sunday, December 8, 2024

ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు

పదర,- పదర మండల కేంద్రంలోని కుమ్మరి కుంట దగ్గర విద్యుత్ వైరు మనిషి ఎత్తులో ఉండి ప్రమాదకరంగా మారడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని పదో వార్డు సభ్యులు శంకర్ యాదవ్ తెలిపారు, ఈ సందర్భంగా గురువారం నాడు ఆయన మాట్లాడుతూ రైతులు తమ పొలాల దగ్గరికి ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటారని విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, బుధవారం నాడు ఒక ఎద్దు విద్యుత్ ప్రమాదానికి గురైందని ఆయన అన్నారు, ఈ విషయాన్ని ట్రాన్స్కో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు, సంబంధిత ట్రాన్స్కో అధికారులు ఇప్పటికైనా స్పందించి కుమ్మరి కుంట వద్ద ఉన్న విద్యుత్ వైర్లను సరిచేసి విద్యుత్ ప్రమాదాలను నివారించాలని శంకర్ యాదవ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement