Sunday, May 5, 2024

ఉత్తర తెలంగాణకు ‘మహా’ దెబ్బ..

దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం తెలంగాణ సరిహద్దు జిల్లాలను ఇప్పుడు కలవరపెడుతోంది. మహారాష్ట్రకు సరిహద్దు జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కలవరం మొదలయింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారి నుంచి ఈ ప్రాంతాల వారికి కరోనా సోకుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వ్యాప్తి పై ఆందోళన నెలకొంది. ఈ జిల్లాలు మహరాష్ట్రను ఆనుకొని ఉంటాయి. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లా కేంద్రాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు బస్సులు, రైళ్లు నడుస్తున్నాయి. వ్యాపారాలు, బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వస్తుంటారు. మహారాష్ట్రలో కరోనా ఉధృతి బాగా ఉండడంతో పక్క రాష్ర్టానికి పోయివచ్చిన వారి నుంచి వైరస్‌ సోకే ప్రమాదం పొంచి ఉంది.

మహారాష్ట్ర బోర్డర్ జిల్లాలో కరోనా కేసులు పెరగడంపై ఆయా అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు బయట ఇష్టానుసారంగా తిరుగుతుండడంతో కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యా రు. వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement