Wednesday, May 15, 2024

వేస‌వి తాపాన్ని త‌గ్గించే దివ్యాష‌దం కొబ్బ‌రిబొండాం…

పెద్దకొత్తపల్లి సహజ సిద్ధంగా లభించే కొబ్బరి బొండం లో ఔషద గుణాలు అధికంగా ఉంటాయని వైద్యులు సూచిస్తుంటారు. కల్తీ లేని కొబ్బరి బోండా నీటి లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి అలసట నుంచి తక్షణ శక్తిని పెంచుకోవడానికి తప్పనిసరిగా కొబ్బరి బొండం నీళ్ళు తాగేస్తుంటారు. మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు గ్లూకోజ్ పెట్టిస్తారు. కానీ గ్రూపులో ఉండే పోషకాల కంటే కొబ్బరి బొండం లో అధికంగా పోషకాలు లభిస్తాయని వైద్యులు గర్భవతులకు అనారోగ్యానికి గురైన వారికి ఆస్పత్రుల్లో పదేపదే చెబుతుంటారు. కొబ్బరి నీళ్లలో పోషక పదార్థాలతో పాటు మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణం రక్తాన్ని శుద్ధి చేసే గుణం కొబ్బరి బొండం నీళ్లకే సాధ్యమవుతుందని డాక్టర్లు పదే పదే చెపుతుంటారు. అప్పుడప్పుడు వచ్చే కడుపులోని మంటను తగ్గించడానికి స్థానికుల కొబ్బరినీళ్లు పనిచేస్తూ ఉంటాయి. మనిషి శరీరంలో లవణాల శాతం పెంచడానికి కూడా ఈ నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి .కొబ్బరి బొండం కల్తీ చేయడానికి వినియోగదారులకు విక్రయదారులకు ఇలాంటి అవకాశం లేదు. కొబ్బరి నీళ్లను ఎప్పుడైనా ఎవరైనా తాగ వచ్చునని వైద్యులు అనారోగ్యానికి గురైన వారికి సూచిస్తుంటారు. కొబ్బరినీళ్లు మనిషికి రక్షణ ఇస్తాయి కొబ్బరినీటిలో సోడియం పొటాషియం కాల్షియం పాస్ఫరస్ ఐరన్ సల్ఫర్ క్లోరైడ్ ప్రోటీన్స్ ఇతర లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పాలలోనిప్రోటీన్ల కంటే అధిక శాతం కొబ్బరి బోండా నీళ్లలో లభిస్తాయి .మూత్రపిండాల సమస్య ఉంటే కొంత మేరకు తగ్గించి శరీరానికి చల్లదనం ఇస్తుంది. మార్కెట్లో దొరికే వివిధ రసాయనాలతో తయారుచేసిన చల్లని పానీయాల కంటే వందరెట్లు ఆరోగ్యం పెంచే కొబ్బరిబోండం మేలని వైద్యులు అనారోగ్యానికి గురైన వారికి సూచిస్తుంటారు . వేసవిలో కొబ్బరి బొండాల కు డిమాండ్ అధికంగా పెరుగుతుంది. స్థానికంగా అక్కడ దొరికే తోటలతో పాటు పక్క రాష్ట్రాలైన బెంగళూరు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాల నుండి వేసవిలో విక్రయాలు జరిపేవారు దిగుమతి చేసుకుంటారు. వేసవి కావడంతో ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో కూడా బోండాలు వేసవిలో విక్రయిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని బట్టి బొండం సైజును బట్టి ధర 20 రూపాయల నుండి 40 రూపాయల వరకు సైజును బట్టి విక్రయదారులు అమ్ము తుంటారు. కొన్ని చోట్ల లీటర్ నీళ్లకు100 రూపాయలు తీసుకుని కొబ్బరి నీటిని పోస్తారు. ఏదిఏమైనా వేసవి కాలంలో వివిధ రసాయనాలతో తయారు చేసే శీతల పానీయాలు తీసుకోవడం కంటే కొబ్బరినీళ్లు తీసుకోవడం చాలా వరకు మంచిదని శీతల పానీయాల కంటే కొబ్బరి నీళ్ళలో వంద రెట్లు మేలు చేసే లక్షణాలు ఉంటాయని ఎండలో తిరిగేవారు తక్షణ శక్తి కోసం కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని డాక్టర్లు పదేపదే అనారోగ్యానికి గురైన వారికి సూచిస్తుంటారు. సాధ్యమైనంతవరకు రసాయనాలతో తయారు చేసే పానీయాలు మానుకుని డాక్టర్ల సూచన మేరకు కొబ్బరి బొండం నీరు త్రాగడం ఆరోగ్యానికి మంచిది

Advertisement

తాజా వార్తలు

Advertisement