Wednesday, December 6, 2023

బాధిత కుటుంబానికి స్పీకర్ పోచారం పరామర్శ

భానువాడ రూరల్, ఆగస్టు 1(ప్రభన్యూస్): బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో గల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీప బంధువు బసిరెడ్డి శకుంతల గత వారం రోజుల క్రితం మరణించారు. ఈ సందర్భంగా సోమవారం సభాపతి పోచారం బోర్లం గ్రామానికి చేరుకొని మృతురాలు శకుంతల చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కుమారుడు బసిరెడ్డి రవీందర్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను వరమర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. సభాపతి వెంట బసిరెడ్డి హనుమంత్ రెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement