Sunday, May 12, 2024

రేపు సిరిసిల్లలో కేటిఅర్ పర్యటన – షెడ్యూల్

హైదరాబాద్ – బి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటలో భాగంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ,స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , , వ్యవసాయ శాఖ మంత్రిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పర్యటన. షెడ్యూల్ ..

👉 కేటీఆర్ ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 9:45 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గం, తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల గ్రామానికి చేరుకుంటారు.

👉 ఉదయం 10 గంటలకు తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ ను ప్రారంభిస్తారు.

👉 ఉదయం 10గంటలకు తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాలను ప్రారంభిస్తారు.

- Advertisement -

👉 మధ్యాహ్నం 1:30 గంటలకు ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చేరుకొని నూతనంగా నిర్మించిన ఎస్సీ హాస్టల్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

👉 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement