Monday, April 29, 2024

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్‌.. మరోసారి ఏక‌గ్రీవ‌ ఎన్నిక

మంత్రి కేటీఆర్ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవం అయ్యారు. వరుసగా రెండోసారి బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు ఇవ్వాల (ఆదివారం) హైదరాబాద్ ఫిలింనగర్ లోని ఎఫ్ఎన్ సీసీ క్లబ్ లో ఎన్నికలు నిర్వహించారు. బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్ ఎన్నికయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా యుగంధర్ రావు, వైస్ ప్రెసిడెంట్ గా చాముండేశ్వరినాథ్, కోశాధికారిగా పాణీరావు ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement