Saturday, April 27, 2024

KHM: ఫ్రెండ్ ను కాటేసిన పాము.. చంపి డాక్టర్ వద్దకు తీసుకెళ్లిన వైనం…

భద్రాచలం,అక్టోబర్ 30(ప్రభ న్యూస్): తన స్నేహితుడిని పాము కాటు వేసింది. దీంతో ఆ వ్యక్తి ఆవేశంతో ఆ పామును చంపేశాడు. అంతేకాకుండా ఒక ప్లాస్టిక్ సంచిలో ఆ పామును వేసుకొని ఏకంగా ఆసుపత్రికి తీసుకువచ్చాడు.

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోకి ఓ వ్యక్తి కవర్ లో పామును తీసుకొని రావటంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఏమిటని ప్రశ్నించగా.. తన స్నేహితుడిని పాము కరిచిందని.. దాని విరుగుడు అందించేందుకు డాక్టర్లకు కాటు వేసిన పామును చూపిస్తే మంచిదని భావించి చంపి తీసుకొచ్చానని సదరు వ్యక్తి తెలియజేశాడు. ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement