Monday, April 29, 2024

New Industry – పుంగనూరు వద్ద ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ పరిశ్రమ – ఎస్‌ఐపీబీ ఆమోదముద్ర 

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద రూ 4,500 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ పరిశ్రమ  ఏర్పాటుకు   స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు( ఎస్‌ఐపీబీ).ఈ రోజు ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రూ 19 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు అయ్యే పలు పరిశ్రమలకు, కొన్ని పరిశ్రమల  విస్తరణలకు ఆమోదం లభించింది. అందులో భాగంగా ప్రముఖ రవాణా సంస్థ పెప్పర్‌ మోషన్‌ కంపెనీ.రూ 4,640 కోట్ల పెట్టుబడితో  చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటుకు ఆమోదం లభించింది.

ఆ పరిశ్రమ ద్వారా  ప్రత్యక్షంగా 8 వేల మందికి, పరోక్షంగా మరో 10 వేల  మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి . అదేవిధంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న  ఎలక్ట్రోస్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.933 కోట్ల పెట్టుబడితో చేయతలపెట్టిన  విస్తరణ. కు కూడా ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఆ విస్తరణ ద్వారా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు సంబంధిత అధికారులు తెలియచేస్తున్నారు. ఈ పరిణామం తో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న పరిశ్రమల పరంపర లో భాగంగా ఈ రెండు పరిశ్రమల వల్ల దాదాపు 10 వేలమందికి ప్రత్యక్షంగా, మరో 15 వేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు కలగనుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement