Thursday, May 9, 2024

Jailer | వ‌రల్డ్ టెలివిజన్ ప్రీమియ‌ర్ కు సిద్దమైన త‌లైవా మూవీ..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్‌గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 10న విడుద‌లైది. ఇక రిలీజ్ అయిన మొద‌టి రోజునుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దూసుకెల్లింది. ఎప్పటిలాగే రజినీకాంత్ తన స్టైల్, స్వాగ్ అండ్ డైలాగ్స్‌తో వావ్ అనిపించారు. దీనికి తోడు అలరించే థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, అనిరుధ్ అంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్ల‌స్ అయ్యాయి.

ఇక స‌క్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ పూర్తి అవ్వడంతో ఈ సినిమా గ‌త నెల (సెప్టెంబరు) 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వ‌చ్చింది. ఇక తాజాగా, ఈ సినిమా వ‌రల్డ్ టెలివిజ‌న్ ప్రీమియర్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ టెలివిజన్ ఛానల్ అయిన జెమినీ టీవీలో ప్రసారం అవ్వడానికి రెడీ అయ్యింది. దీపావళీ సందర్భంగా ఈ సినిమా ప్రసారం కానున్నట్టు జెమినీ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే థియేటర్స్‌, ఓటీటీలోను అదరగొట్టిన జైలర్.. టీవీలో ఓ రేంజ్‌లో రేటింగ్‌ను తెచ్చుకోనుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement