Wednesday, May 8, 2024

జడ్పీహెచ్‌ఎస్‌లో పునరావాస కేంద్రం.. పరిశీలించిన‌ వరద సహాయక అధికారి

అశ్వాపురం మండలం మిట్టగూడెం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని వరద సహాయక చర్యల ప్రత్యేక అధికారి అనుదీప్ ఇవ్వాల (గురువారం) ఆకస్మిక తనిఖీ చేశారు. పునరావాస కేంద్రంలోని ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పునరావాస ప్రజలను ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఆరోగ్య పరిరక్షణకు అత్యవసర కేంద్రాలు నిర్వహించాలని చెప్పారు.

నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని సూచించారు. వరద ముంపు తగ్గి పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేవరకు ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ఆయన సూచించారు. ప్రత్యేక అధికారి ఎన్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రాజు, వ్యవసాయ శాఖ ఎడి తాతారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement