Wednesday, May 15, 2024

భ‌ద్రాచ‌లం గోశాల‌ల‌కు ప‌శుగ్రాసాన్ని విత‌ర‌ణ చేసిన ఎమ్మెల్యే సండ్ర

భారతీయ సంస్కృతిలో గోమాతను దేవతగా భావిస్తారని, అటువంటి గోమాతకు గోదావరి వరదల కారణంగా పశుగ్రాసం కొరతతో ఇబ్బంది పడుతున్నాయని తెలుపగా సత్తుపల్లి నియోజకవర్గంలోని మండలాల నుండి 50 ట్రాక్టర్లు ట్రక్కుల పశుగ్రాసాన్ని భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గోశాలకు, గాయత్రీ గోక్షేత్రం గోశాలకు, అంబసత్రం గోశాలకు వితరణ చేయడం జరిగిందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం నుండి 50 ట్రాక్టర్ ట్రక్కుల పశుగ్రాసంతో బయల్దేరి భద్రాచలం గోశాలకు వితరణ చేయడానికి తీసుకురాగా ఈ కార్యక్రమాన్ని భద్రాచలం వద్ద కలెక్టర్, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ల‌తో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పశుగ్రాసాన్ని వితరణ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement