Wednesday, May 15, 2024

విశాఖలో క్యాంప్‌ ఆఫీస్‌! వచ్చే నెలలోనే శ్రీకారం

అమరావతి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన రాజకీయ చతురతకు పదును పెడుతున్నా రు. గడచిన రెండు, మూడు మాసాలుగా ఆయన తీసుకుంటు న్న నిర్ణయాలు, మాట్లాడుతున్న మాటలు ఆయన పాలనలో వేగం పెంచుతున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్లీనరీ భారీ సక్సెస్‌ కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న సీఎం జగన్‌ ఇప్పుడు విశాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఆగస్టు మాసంలో విశాఖ లో తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాలని వడివడిగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆషాడ మాసం కావడంతో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు మాసంలో పూర్తిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు విశాఖలో క్యాంపు కార్యాలయ ఏర్పాట్లు ఊపందుకున్నా యని తెలుస్తోంది. మూడు రాజధానులపై కోర్టు కేసు ఉన్నందున రాజధానిని తరలించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆయన తన క్యాంపు కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతిపక్షాలకు తన మార్క్‌ రాజకీయం చూపించే అవకాశం ఉందని సీఎం జగన్‌ భావనగా చెబుతున్నారు.

కోర్టు తీర్పును గౌరవిస్తూనే..

ఇదిలా ఉండగా మూడు రాజధానుల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే కోర్టు తీర్పును గౌరవిస్తూనే ఆయన తన కార్యాచరణ రూపొందించుకుం ట ున్నారు. వ్యవస్థలను అక్కడకు తీసుకెళ్లకుండా ఆయన తన క్యాంపు కార్యాలయాన్ని మాత్రమే అక్కడకు తీసుకువెళ్లి వారంలో మూడు రోజులపాటు అక్కడ నుండి అన్ని అంశాలను చక్కబెట్టనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యా లయంలో కూర్చొనే సమయాన్నే విశాఖలోని తన క్యాంపు కార్యా లయంలో కూర్చొని పరిపాలన సాగించనున్నారు. ఇలా చేయడం వల్ల కోర్టు తీర్పును గౌరవించడంతోపాటు తాను అనుకున్నది కూడా నెరవేరుతుందని సీఎం అభిమతంగా పార్టీ వర్గాలు పేర్కొం టు న్నాయి. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాట్లు విశాఖలో తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

వారంలో మూడు రోజులు..

ఇకపై వారంలో మూడు రోజులపాటు అక్కడే ఉండేలా సీఎం జగన్‌ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఆమేరకు అవసరమైన అధికారులను మాత్రమే అక్కడకు తరలించనున్నారు. మిగిలిన అధి కారులు అవసరమైతే అక్కడకు పిలిపించుకునే అవకాశం ఉందని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. కేవ లం క్యాంపు కార్యా లయం మాత్రమే విశాఖకు వెళ్లే అవకాశ ముందని, ఇతర కార్యాల యాలన్నీ అమరావతి నుండే పరిపాలన కొనసాగిస్తాయని పార్టీ సీనియర్‌ నేత కూడా ఒకరు తన అభిప్రాయన్ని వెల్లడించారు. ఎక్కువ శాతం అధికారులు ఇక్కడే ఉండటం వల్ల మొదటి నాలుగు రోజులపాటు అమరావతిలో సీఎం జగన్‌ ఉండేలా కార్యాచరణ సి ద్ధం చేశారు. అయితే, చివరి రెండు రోజు లు సెలవు దినాలు కా వడంతో కేవలం సమీక్ష నిర్వ హించే శాఖ అధికారులు మాత్రమే ఆ రెండు రోజుల్లో అందుబాటులో ఉండేలా చేస్తే ఎలా ఉంటుం దన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. అది సాధ్యపడ కపోతే మూడు రోజులు అక్కడి నుండి ప్రభుత్వ పరమైన అంశాలపై దృష్టిసారించి మిగిలిన నాలుగు రోజులు మాత్రం అటు ప్రభుత్వం ఇటు పార్టీ పరమైన అంశా లపై సీఎం జగన్‌ దృష్టిపెట్టే అవకాశాలను కూడా పరిశీ లిస్తున్నారు.

- Advertisement -

ఒక దెబ్బకు రెండు పిట్టలు..

ఉన్నట్టుండి సీఎం జగన్‌ ఈనిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ ఎత్తుగడే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎటుగూడి రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్‌కు తిరుగులేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మేరకు ఈసారి కూడా సీట్లు వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రలో కూడా అదే పరిస్థితి కల్పిస్తే ప్రతిపక్షాలకు ధీటైన జవాబు చెప్పొచ్చనేది ఇప్పు డు చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయంగా పార్టీకి మంచి మైలేజీ తీసుకొస్తుందని పార్టీ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. ఇక రెండో అంశంగా విశాఖ నుండి పరిపాలన సాగిస్తామని సీఎం జగన్‌ ఏడాదిన్నర క్రితమే చెప్పారు. ఈ క్యాంపు కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటుచేసి వారంలో మూడు రోజుల పాటు అక్కడి నుండే పాలన సాగించడం ద్వారా ఆయన తన మూడు రాజధానుల అంశం హామీని కూడా నిలబెట్టుకున్నట్లవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement